MindYourLogic

Games Blog

కృష్ణ స్టోరీస్ గేమ్ | వెన్న దొంగ కృష్ణుడి సాహసాలు – వెన్నను సేకరించండి

మీరు శ్రీకృష్ణుడి గురించి ఎన్నో కథలు విని ఉంటారు. కానీ ఆ కథలను కేవలం వినడం కాకుండా, నిజంగా మనమే ఆ కథల్లోకి వెళ్లి 'వెన్న దొంగ' గా మారితే ఎలా ఉంటుంది?

శ్రీకృష్ణుడి వెన్న దొంగతనాల గురించి మీరు కేవలం కథలు వినరు. వెన్న దొంగ కృష్ణ స్టోరీస్ గేమ్‌లో మీరు చిన్నారి కృష్ణుడిలా మారి, గోపికల కళ్ళుగప్పి వెన్న కుండలను అందుకోవడమే లక్ష్యంగా ఆడతారు. కృష్ణుడిలా తెలివిగా ఆలోచిస్తూ, ఆయన చిన్ననాటి వెన్న దొంగతనాల సాహసాలను ఈ గేమ్ రూపంలో అనుభవించవచ్చు.

krishna stories game thumbnail

గేమ్ పూర్తి చేయాలంటే మీరు:

* కృష్ణుడిలా తెలివిగా ఆలోచించి వెన్న కుండలను చేరుకోవాలి.

* మీ తెలివి, గమనించే శక్తి, వేగంగా నిర్ణయం తీసుకునే నైపుణ్యాన్ని ఉపయోగించాలి.

* గోపికల కంట పడకుండా కష్టమైన పరిస్థితుల్లో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి.

* సరదాగా చేసే వెన్న అల్లరిని తెలివైన విజయంగా మార్చాలి.

కృష్ణుడి చిన్ననాటి జీవితం ఆటలు, వెన్న దొంగతనాలు, సాహసాలు మరియు తెలివితో నిండిపోయి ఉండేది. ఈ గేమ్‌లో  వెన్న దొంగతనాల సంఘటనలను సరదా పజిల్స్‌గా మార్చారు. గోపికల ఇళ్ళలోకి చప్పుడు చేయకుండా వెళ్లడం నుంచి ఎత్తులో ఉన్న వెన్న కుండలను పగలగొట్టడం వరకు, ప్రతి లెవెల్ ఒక కొత్త 'వెన్న దొంగ ' కథలా ఉంటుంది. ఇది కేవలం గేమ్ కాదు!


Krishna Stories game image 1

కృష్ణుడు వెన్న దొంగిలించడానికి ఎలాంటి ఉపాయాలు వేసేవాడో ఆలోచించడం కూడా నేర్చుకుంటారు. మీ తెలివితో, కొత్తగా ఆలోచిస్తూ ప్రతి పజిల్‌ను ఎలా పరిష్కరించాలో ఈ ఆట నేర్పుతుంది.మీ ప్రయాణం అందమైన గోకులం గ్రామంలో మొదలవుతుంది. అక్కడ చిన్నారి కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్న దొంగిలించడానికి కొత్త కొత్త ప్లాన్లు వేస్తుంటాడు. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మీరు కూడా గోకులంలో ఉన్నట్టుగా, 'వెన్న దొంగ' గా మారినట్టుగా అనిపిస్తుంది.

 

 

 మీ లక్ష్యం!

krishna stories game image 3

'వెన్న దొంగ' గా ఆడి అన్ని లెవెల్స్ పూర్తి చేయాలి. పజిల్స్ పరిష్కరించాలి, గోపికల కాపలాను దాటుకొని వెన్న కుండలను పగలగొట్టాలి. ప్రతి లెవెల్‌లో ఒక ప్రశ్న మీ ముందుంటుంది: "నేను కృష్ణుడిలా ఉంటే ఈ వెన్న కుండను ఎలా అందుకోగలను?

ఎవరికి కనిపించకుండా, చప్పుడు కాకుండా గదిలోకి వెళ్ళి వెన్న తీసుకోవాలి. గోపికలు చూసేలోపే సరైన సమయం చూసి, తెలివిగా ప్లాన్ చేయాలి.

కుండను పగలగొట్టే ఛాలెంజ్, ఎత్తులో ఉరిమి వేలాడదీసిన కుండను సరిగ్గా గురి చూసి రాయి లేదా గోలీలతో పగలగొట్టాలి. కుండ పగిలితే మీకు రుచికరమైన వెన్న దొరుకుతుంది!

krishna stories game image 2

ఈ గేమ్ ఎందుకు ప్రత్యేకం:

'వెన్న దొంగ' చిన్ననాటి వెన్న సాహసాలను నిజంగా అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది.

గోకులంలోని పాతకాలపు జీవితాన్ని, అల్లరిని సరదాగా తెలుసుకోవచ్చు.

సవాళ్లను దాటడానికి తెలివిగా ఆలోచించడం నేర్పిస్తుంది.

ప్రతి లెవెల్‌లో ఒక కొత్త వెన్న కుండ పజిల్ ఉంటుంది.

మీరు గోకులంలో 'వెన్న దొంగ గా' మారి మీ తెలివిని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?

 

 
"కృష్ణ స్టోరీస్ గేమ్‌" ను డౌన్‌లోడ్ చేసుకుని, కృష్ణుడిలా సరదా వెన్న సాహసాలను ఆడుతూ ఆనందించండి!

ఆడి చూడండి... వెన్న గెలుచుకోండి!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి 
"krishna stories game"!