MindYourLogic

20 Chilipi Podupu Kathalu in Telugu


చిలిపి పొడుపు కథలు కి స్వాగతం, ఇక్కడ వినోదం మరియు తెలివైన చిక్కులు వేచి ఉన్నాయి! ఈ వినోదభరితమైన Chilipi Podupu Kathalanu ఆస్వాదించండి మరియు మీ మనస్సుకు ఆనందాన్ని మరియు సవాలును అన్వేషించండి.ఈ మెదడు టీజర్‌లు మీకు సవాలు విసురుతాయి మరియు మీ సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతాయి. మీరు ఈ Chilipi Podupu Kathalunu పరిష్కరించగలరా?  డైవ్ చేసి తెలుసుకోండి!

 

1.తనువంతా రంధ్రాలు కానీ తీయగా పాడుతాను.
అది ఏమిటి ?

జవాబు: పిల్లనగ్రోవి 

 

2.చారెడు నీళ్ళల్లో చామంతి బిళ్ళ.
అది ఏమిటి ?

జవాబు: నూనె, నూనె లో వడ 

 

3.గంపెడు శనగల్లో ఒక గులకరాయి.
అది ఏమిటి ?

జవాబు: చందమామ 

 

4.గిన్నె….. గిన్నె లో వెన్న….. వెన్న లో నల్లద్రాక్ష.
అది ఏమిటి ?

జవాబు: కన్ను 

 

5.మా ఇంటి వెనుక ఒక గూనొడు.
అది ఏమిటి ?

జవాబు: నాగలి 

 

 

 

6.పాముని చంపుతాను కానీ,
గ్రద్దను కాను, ఒళ్లంతా కళ్లు ఉంటాయి,
కాని ఇంద్రుడుని కాను,
నాట్యం చేస్తాను కానీ శివుడిని కాను,
నేనెవర్ని?

జవాబు: నెమలి 

 

7.ఒళ్లంతా ముళ్ల్లే కానీ రత్నలాంటి బిడ్డలు.
అది ఏమిటి ?

జవాబు: పనస పండు 

 

8.తోలు నలుపు, తింటే పులుపు అది ఏమిటో తెలుపు.
అది ఏమిటి ?

జవాబు: చింతపండు 

 

9.అలాము కొండకు సలాము కొట్టు.
అది ఏమిటి ?

జవాబు: గొడ్డలి 

 

10.అయ్యంటే దూరంగా వెళ్లి అమ్మంటే దగ్గరకు వచ్చేవి ఏమిటి? 

జవాబు: పెదవులు 

 

 

 

11.అడవిలో అక్కమమ జుట్టు విరబోసుకును కూర్చుంది.
అది ఏమిటి ?

జవాబు: ఈతచెట్టు 

 

12.అరుగు గోడకు అరచేయి.
అది ఏమిటి ?

జవాబు: పిడక

 

 13.కదలలేడు,
కానీ కావలికి గట్టివాడు.
అది ఏమిటి ?

జవాబు:  తాళం 

 

14.ఎర్రవాడొస్తే,
నల్లవాడు పారిపోతాడు.
అది ఏమిటి ?

జవాబు: సూర్యుడు, చీకటి 

 

15.బంగారు చెంబులో వెండి గచ్చకాయ,
అది ఏమిటి ?

జవాబు: పనసపండు గింజ 

 

 

 

16.బండకు కొడితే వెండి ఊడుతుంది.
అది ఏమిటి ?

జవాబు: కొబ్బరికాయ 

 

17.అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
అది ఏమిటి ?

జవాబు: కవ్వం 

 

18.నూరు పళ్లు, ఒకటే పెదవి.
అది ఏమిటి ?

జవాబు: దానిమ్మ పండు 

 

19.పైడిపెట్టెలో ముత్యపు గింజ.
అది ఏమిటి ?

జవాబు: వడ్లగింజ 

 

20.పొట్టలో వేలు,
నెత్తి మీద రాయి.
అది ఏమిటి ?

జవాబు: ఉంగరం 

 

మీరు ఈ podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని  నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu: Test Your IQ with 20 Telugu Podupu Kathalu దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.

 


podupu kathalu in telugu

35-Telugu-Short-Stories-Fun-Riddles-for-Kids-Adults
Palak chhabriya 2026-04-03

35+ తెలుగు పొడుపు కథలు | పిల్లలు & పెద్దల కోసం సరదా రిడిల్స్

తెలుగు పొడుపు కథలు చదవాలనుకుంటున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ ఆస్వాదించే 35+ సరదా తెలుగు పొడుపు కథలు...

60-telugu-riddles-with-answers-for-kids-and-adults-trendy
Palak Chhabriya 2026-03-31

60+Telugu Riddles with Answers for Kids and Adults – TRENDY

Discover the new collection of 60 +Telugu riddles with answers for kids and adults- TRENDY. From eas...

50-best-podupu-kathalu-riddles-2026-edition
Palak Chhabriya 18-03-2026

50+ Best Podupu Kathalu (Riddles) 2026 Edition

మీరు ఉత్తమ తెలుగు పొడుపు కథల కోసం చూస్తున్నారా? సమాధానాలతో కూడిన 50+ Best Podupu Kathalu 2026 Editio...

35-fun-telugu-riddles-for-everyone-podupu-kathalu
Palak Chhabriya 18-03-2026

35+ fun Telugu riddles for everyone | Podupu Kathalu

35+ fun Telugu riddles for everyone సమాధానాలతో చదవండి. పిల్లలు, విద్యా ర్థులు మరియు పెద్దలు అందరూ ఆస...

50-plus-telugu-riddles-img-1
Kanchan Balani 23-08-2024

50+ Telugu Riddles | MindYourLogic Riddles

Challenge your mind with these amazing Telugu Riddles . These riddles will sharpen your thinking ski...