50+ Telugu Riddles | MindYourLogic Riddles
MindYourLogic మీ కోసం 50 కి పైగా తెలుగు పొడుపుకథలు తీసుకువచ్చింది, వీటిని పరిష్కరించడం ద్వారా మీ మెదడుని పరీక్షించవచ్చు, అలాగే మీ మెదడు వ్యాయామం కూడా అవుతుంది. ఈ తెలుగు పొడుపుకథలు సమాధానాల తో ఇవ్వ బడ్డాయి. మీరు ఈ తెలుగు పొడుపుకథలను ఛేదించగలరో లేదో చూద్దాం!
1. ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి?
జ. తేనెపట్టు
2. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు?
జ. అరిటాకు
3. ఆలు కాని ఆలు?
జ. వెలయాలు
4. అందం కాని అందం?
జ. పరమానందం, బ్రహ్మానందం
5. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు?
జ. చీమలదండు
6. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది?
జ.దీపం వెలుగు.
7. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జ. పొగ
8. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జ. మేఘం
9. తలపుల సందున మెరుపుల గిన్నె?
జ. దీపం
10. తల్లి దయ్యం, పిల్ల పగడం?
జ. రేగుపండు
11. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర?
జ. కొవ్వొత్తి
12. నల్లకుక్కకు నాలుగు చెవులు?
జ. లవంగం
13. ఒకటే తొట్టి, రెండు పిల్లలు?
జ. వేరుశనగ
14. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు?
జ. ఉల్లిపాయ
15. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జ. చింతపండు
16. తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల
17. తోలు నలుపు, తింటే పులుపు?
జ. చింతపండు
18. తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు
19. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.
20. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు
21. కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ
22. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త
23. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.
24. నూరు పళ్లు, ఒకటే పెదవి?
జ. దానిమ్మ
25. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు?
జ. సూది
26. పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు?
జ. తాళం కప్ప
27. అమ్మ తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమాను?
జ. చందమామ
28. అరటి పండుకి పదే విత్తులు?
జ. బొగడగొట్టం
29. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది?
జ. గొడ్డలి
30. అర చేతి కింద అరిసె?
జ. పిడక
31. అలాము కొండకు సలాము కొట్టు?
జ. గొడ్డలి
32. అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
జ. పెదవులు
33. అంక పొంకలు లేనిది?
జ. శివలింగం
34. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?
జ. ఈతచెట్టు
35. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది?
జ. అత్తి చెట్టు
36. తొడిమ లేని పండు, ఆకులేని పంట?
జ. విభూది పండు, ఉప్పు
37. తన్ను తానే మింగి, మావమౌతుంది?
జ. మైనపు వత్తి
38. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు?
జ. అద్దం
39. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ
40. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జ. రైలు
41. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జ. నీడ
42. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు?
జ. వల
43. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?
జ. ఉంగరం
44. పొడవాటి మానుకి నీడే లేదు?
జ. దారి
45. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు?
జ. పొయ్యి
46. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది?
జ. అత్తిపత్తి
47. ముద్దుగా నుండును, ముక్కు పైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి?
జ. కళ్లజోడు.
48. పైడి పెట్టెలో ముత్యపు గింజ?
జ. వడ్లగింజ
49. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు?
జ. కడవ, చెంబు
50. పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు?
జ. మొగలిపువ్వు.
మీరు ఈ Podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి, podupu kathalu: 25+ Podupu Kathalu in Telugu With Answers దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.