MindYourLogic

20 Podupu Kathalu


 పొడుపు కథలకు స్వాగతం ! ఈ చిన్న మరియు ఆహ్లాదకరమైన Podupu Kathalu మీ మనస్సును అలరించడానికి మరియు సవాలు చేయడానికి ఇక్కడ ఉన్నాయి. ఈ తెలుగు పొడుపు కథల లోకి ప్రవేశిద్దాం!ఈ పోస్ట్‌లో మేము 20 Podupu Kathalani with Answers తో సహా ఇచ్చాము.

 

1. ఇక్కడ ఉంటుంది - అక్కడ ఉంటుంది ,
పిలిస్తె పలుకుతుంది - మనలాగే మాట్లాడుతుంది,
ఏమిటి అది? 

జవాబు:టెలిఫోన్

 

2. ఉద్యోగం సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే,
ఏమిటి అది? 

జవాబు: కుక్క

 

3. ఉడికిందొకటి,
ఉడకందొకటి,
కాలిందొకటి,
కాలందొకటి,
ఏమిటది? 

జవాబు: వక్క,ఆకు,సున్నం,పొగాకు

 

4. ఊరంతకీ ఒక్కటే దుప్పటి,
ఏమిటి అది? 

జవాబు: ఆకాశం

 

5. ఊరంతా నాకి మూల కూర్చుండేది .
ఏమిటి అది? 

జవాబు: చెప్పులు

 

 

6. ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి, ఏమిటి అది? 

జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.

 

7. ఎర్రని రాజ్యం,
నల్లని సింహాసనం,
ఒక రాజు ఎక్కితే,
ఒక రాజు దిగుతాడు,
ఏమిటది?

జవాబు: మిరపచెట్టు.

 

8. ఏడుగురు అన్నదమ్ములం మేము;
విడివిడిగా వుంటే చెప్పలేవు ,
కలసి వుంటే చెప్పగలవు, ఏమిటి అది?    

జవాబు: ఇంద్రధనస్సు

 

9. ఐదుగిరిలో చిన్నోడు,
పెళ్ళికి మాత్రం పెద్దోడు,
ఏమిటి అది? 

జవాబు: చిటికెన వేలు

 

10. ఐదుగురు, ఐదుగురు, దొంగలు రెండు జట్లు గా పోయి ఒక జీవాన్ని తెచ్చారు.వెంటనే చంపారు,ఏమిటి అది? 

జవాబు: పేను

 

 

11. ఐదు తంత్రాలు గలది,
పిల్లలకు మహాఇష్టమైనది,
ఏమిటి అది? 

జవాబు: పంచతంత్రం

 

12. ఓహోహో హాలయ్య ,
 వల్లంతా గరుకయ్యా,
కరకర కోస్తె కడుపంతా తీపయ్యా,
ఏమిటి అది?  

జవాబు: పనస పండు.

 

13. అంగడిలో పెట్టి అమ్మేది కాదు,
తక్కెడలో పెట్టి తూచేది కాదు,
ఆలోచించటానికి ఆధారమైనది,
అది లేకుండా మనిషేకాదు,
ఏమిటి అది? 

జవాబు: మెదడు

 

14. అందమైన గోపురం ,
మధ్య దూలం ,
మంచి గాలి లోనికెళ్ళి చెడ్డ గాలి బయటకొచ్చు, 
ఏమిటి అది? 

జవాబు: ముక్కు

 

15. అందమైన వస్త్రంపై అన్నీ వడియాలే,
ఏమిటి అది? 

Add answer

 



16. కిట కిట తలుపులు,
కిటారి తలుపు,
ఎప్పుడు తీసిన చప్పుడు కావు,
ఏమిటవి?

జవాబు: కనురెప్పలు

 

17. కొండ మీద బండరాయి,
రాతి మీద లోతు బావి,
బావిలోపల ఊరే జల,
ఆడే పాము,
ఏమిటి అది? 

జవాబు: తల - నోరు ఉమ్ము - నాలుక

 

18. కొండల్లో పుట్టి కోనల్లో నడిచి,
సముద్రంలో చేరే నెరజాణ,
ఏమిటి అది?    

జవాబు:నది

 

19. గోడమీద బొమ్మ
గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారికి
వడ్డించు బొమ్మ, ఏమిటి అది?    

జవాబు: తేలు.

                                   

20. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం,
ఏమిటి అది? 

జవాబు: తేనెపట్టు

 

మీరు ఈ podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని  నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,podupu kathalu: 20 Hard Podupu Kathalu with Answers  దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు!

 

 


podupu kathalu in telugu

35-Telugu-Short-Stories-Fun-Riddles-for-Kids-Adults
Palak chhabriya 2026-04-03

35+ తెలుగు పొడుపు కథలు | పిల్లలు & పెద్దల కోసం సరదా రిడిల్స్

తెలుగు పొడుపు కథలు చదవాలనుకుంటున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ ఆస్వాదించే 35+ సరదా తెలుగు పొడుపు కథలు...

60-telugu-riddles-with-answers-for-kids-and-adults-trendy
Palak Chhabriya 2026-03-31

60+Telugu Riddles with Answers for Kids and Adults – TRENDY

Discover the new collection of 60 +Telugu riddles with answers for kids and adults- TRENDY. From eas...

50-best-podupu-kathalu-riddles-2026-edition
Palak Chhabriya 18-03-2026

50+ Best Podupu Kathalu (Riddles) 2026 Edition

మీరు ఉత్తమ తెలుగు పొడుపు కథల కోసం చూస్తున్నారా? సమాధానాలతో కూడిన 50+ Best Podupu Kathalu 2026 Editio...

35-fun-telugu-riddles-for-everyone-podupu-kathalu
Palak Chhabriya 18-03-2026

35+ fun Telugu riddles for everyone | Podupu Kathalu

35+ fun Telugu riddles for everyone సమాధానాలతో చదవండి. పిల్లలు, విద్యా ర్థులు మరియు పెద్దలు అందరూ ఆస...

50-plus-telugu-riddles-img-1
Kanchan Balani 23-08-2024

50+ Telugu Riddles | MindYourLogic Riddles

Challenge your mind with these amazing Telugu Riddles . These riddles will sharpen your thinking ski...