Example GIF

20 Telugu Podupu Kathalu with Answers for Kids


పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సమాధానాలతో కూడిన మా తెలుగు పొడుపు కథల ప్రపంచానికి స్వాగతం! ఈ ఉల్లాసభరితమైన Telugu Podupu Kathalu with Answers for Kids వినోదం మరియు అవగాహన కోసం రూపొందించబడ్డాయి, ప్రతి ఒక్కటి తెలివైన పరిష్కారంతో. మేము సరదాగా మరియు నేర్చుకునే ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మాతో చేరండి, యువ మనస్సులను సవాలు చేస్తూ మరియు ఉత్సుకతను రేకెత్తించండి. సాహసం ప్రారంభించండి!" Telugu podupu Khatalu కోసం మీరంతా సిద్ధంగా ఉన్నారా?

 

1. నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే, లేచి కూర్చుంటా
ఎండినవైతే మరీ ఇష్టం, కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు, నేను ఎవరిని?

. అగ్ని

 

2. నీటిలో ఉంటే ఎగసిపడతాను
నేలమీద మాత్రం కూలబడతాను, నేను ఎవరిని?

. కెరటాని

 

3. వెలుతురూ ఉంటేనే కనిపిస్తాను
చీకటి పడితే మాయమౌతాను, నేను ఎవరిని?

. నీడని

 

4. నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు, నేను ఎవరిని?

. సమయని

 

5. కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను.
తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. నేను ఎవరు?

. బొగ్గు

 

 

 

6. పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషి ని కాను
ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని?

. రామ చిలుక

 

7. నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు
ఎన్నో దారులున్నాయి కానీ వాహనము పోదు
ఎన్నో దేశాలున్నాయి కానీ భూమిని కాదు, మరి ఎవరిని?

. ప్రపంచ పటం (మ్యాప్)

 

8. నా నిండా రంధ్రాలు, అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని?

. స్పాంజి

 

9. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు, మరి ఎవరిని?

. శబ్దం

 

10. అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు, మరి ఎవరిని?

. కంచం

 

 

 

11. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను
మురికిగా ఉంటే, తెల్లగా అయిపోతా, ఎవరిని?

. బ్లాక్ బోర్డు

 

12. నేను కరుస్తాను కానీ పళ్ళు లేవు, మరి ఎవరిని?

. చెప్పులు

 

13. ఒక ఇంటిలో ఒక పిల్ల, ఇంటికి కిటికీలు, తలుపులు లేవు. విరగ్గొట్టుకునే బైటికి రావాలి. మళ్ళీ లోపలి పోలేదు. ఏమిటది?

. కోడిగుడ్డు

 

14. తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది. పాము లేదు కానీ పుట్ట ఉంది, ఏమిటది?

. పుట్టగొడుగు

 

15. నన్ను వేసే వాళ్ళే గాని తీసేవాళ్ళు లేరునేను ఎవరిని?

. గోడకి సున్నం

 

 

16. అమ్మ కోసి ఇచ్చినప్పుడు ఎర్రగా ఉంది. తినటం పూర్తవగానే ఆకుపచ్చ రంగుకోచ్చింది. ఏమిటది?

జ. పుచ్చకాయ

 

17. ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చుస్తే, మరొకటి నలుపునే చూస్తుంది. ఏమిటది?

జ. ఆకాశం (రాత్రి, పగలు)

 

18. నేను పుట్టినప్పుడు పచ్చగా ఉంటాను,పెరిగి ఎర్రగా మారతాయా, చివరికి నల్లగా ఉంటా , నాతొ కళ్ళని పోలుస్తారు, నేను ఎవరిని? 

జ. నేరేడు పళ్ళు

 

19. గుట్టు చప్పుడు కాకుండా వస్తుంది. గడగడా త్రాగుతుంది
కళ్ళు మూసుకుని, తననెవ్వరు చూడలేదు అని అనుకునే అమాయకురాలు, ఎవరు అది?

జ. పిల్లి

 

20. అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు, వాటికి వెళ్లే దారికాని వచ్చే దారే లేదు. ఏమిటది?

జ. జల్లెడ

 

మీరు ఈ podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని  నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu: 20 Easy Telugu Riddles with Answers to Challenge Your Brain! దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.

 

 

 


podupu kathalu in telugu

top-20-riddles-in-telugu-img-1
Kanchan Balani 2023-10-11

Top 20 Riddles in Telugu

Explore our 'Top 20 Riddles in Telugu' collection! Engage your mind, and enjoy the thrill of solving...

20-famous-telugu-riddles-with-answers-img-1
Kanchan Balani 2023-10-12

20 Famous Telugu Riddles with Answers

Explore the charm of Telugu knowledge with our collection of 20 Famous Telugu Riddles with Answers. ...

20-viral-podupu-kathalu-with-answers-img-1
Kanchan Balani 2023-10-12

20 Viral Podupu kathalu with Answers

Enjoy 20 Viral Telugu Riddles! Boost creativity and logic in kids. Explore, create, and have fun wit...

20-hard-podupu-kathalu-with-answers-img-1
Kanchan Balani 2023-10-17

20 Hard Podupu Kathalu with Answers

Test your mind with 20 Hard Podupu Kathalu with Answers! Enhance problem-solving skills and explore ...