20 Easy Riddles in Telugu with Answers కి స్వాగతం! మేము సరళమైన మరియు ఆకర్షణీయమైన Telugu Podupu Kathalu ను మానసిక వ్యాయామం కోసం అందిస్తున్నాము సిద్ధంగా ఉండండి. ఈ తెలుగు పొడుపు కథలు సరద మరియు నేర్చుకోవడం కోసం రూపొందించబడ్డాయి, మీ మనస్సును సవాలు చేయడానికి ఒక ఉల్లాసభరితమైన మార్గాన్ని అందిస్తాయి.సరళమైన మరియు వినోదాత్మకమైన పదాల ప్రపంచాన్ని ఆస్వాదిద్దాం!"
1.నూతిలో పాము, నూరు వరహాలిచ్చినా బయటకు రాదు, ఏమిటది?
2.నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
3.పలుకుగాని పలుకు,ఎమిటది?
4.పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు.ఎమిటది?
5.పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది.ఏమిటది?
6.పచ్చపచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు,ఎమిటది?
7.పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా,ఎమిటది?
8.పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.ఎమిటది?
9.పిఠాపురం చిన్నవాడా, పిట్టలకు వేటగాడా,బతికిన పిట్టను కొట్టా వద్దు,చచ్చిన పిట్టను తేనూ వద్దు,
కూరకు లేకుండా రానూ వద్దు, ఏమిటది?
10.పిల్లికి ముందు రెండు పిల్లులు - పిల్లికి వెనుక రెండు పిల్లులు - పిల్లికీ పిల్లికీ మధ్య ఒక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లులు?
11.పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది,ఎమిటది?
12.బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.ఎమిటది?
13.భూమిలో పుట్టింది - భూమిలో పెరిగింది - రంగేసుకొచ్చింది రామచిలుక,ఎమిటది?
14.ముందుగా పలకరిస్తుంది మళ్ళీ తిడుతుంది తర్వాత మర్యాదగా అంటుంది,ఎమిటది?
15.మాట్లాడుతుంది కానీ మనిషి కాదు,ఎమిటది?
16.మూడు కళ్ళ ముసలిదాన్ని,నేనెవరిని?
17.మూడు కళ్ళుంటాయి కానీ ఈశ్వరుడు కాదు,ఎమిటది?
18.మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారు, చెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా,
దీని భావమేమి తిరుమలేశ,ఎమిటది?
19.ముక్కుతో చూడగలం - కంటితో చూడలేము,ఎమిటది?
20.మేసేది కాసంత మేత:
కూసేది కొండంత మోత.ఎమిటది?
మీరు ఈ podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu: 20 Telugu Podupu Kathalu with Answers for Kids! దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.