20 Famous Telugu Riddles with Answers సేకరణకు స్వాగతం'! మేము ఈ బ్లాగ్ పోస్ట్ లో Famous Telugu Riddles ను మీ కోసం ఇచ్చాము. అవి సవాళ్లు మాత్రమే కాదు; సమాధానాలతో కూడిన Famous Telugu Riddles యొక్క సంతోషకరమైన అన్వేషణ. మాతో చేరండి, మీ తెలివితేటలను పరీక్షించుకోండి మరియు కలిసి తెలుగు చిక్కుల ఆకర్షణను వెలికితీయండి!"
1. మొదట చప్పన,
నడుమ పుల్లన,
కొస కమ్మన,
అది ఏమిటి?
2. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది,
అది ఏమిటి?
3. రాజు నల్లన,
ప్రధాని పచ్చన,
పాలు పుల్లన,
అది ఏమిటి?
4. రెండు కొడతాయి,
ఒకటి పెడుతుంది,
అది ఏమిటి?
5. రాళ్ల అడుగున విల్లు,
విల్లు కోనలో ముళ్ళు,
అది ఏమిటి?
6. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే,
అది ఏమిటి?
7. అడవిలో పుట్టింది,
మెదరింట్లో మెలిగింది
వంటినిండా గాయాలు,
కడుపు నిండా రాగాలు
అది ఏమిటి?
8. చారల పాము,
చక్కటి పాము
నూతిలో పాము,
నున్ననైనా పాము
అది ఏమిటి?
9. నాదశ్వరానికి లొంగని త్రాచు,
నిప్పంటించగానే ఆడిస్తుంది
అది ఏమిటి?
10. తొడిమ లేని పండు,
ఆకు లేని పంట,
అది ఏమిటి?
11. తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు;
కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదు;
పాకి పోవు చుండు, పాము కాదు;
అది ఏమిటి?
12. అందమైన గోపురం - మధ్య దూలం - మంచి గాలి లోనికెళ్ళి చెడ్డ గాలి బయటకొచ్చు,
అది ఏమిటి?
13. సన్న తోడవు తొలగిస్తే,
కమ్మని వెన్నముద్ద
అందరూ ఇష్టంగా ఆరగిస్తారు,
అది ఏమిటి?
14. అడుగులున్నా కాళ్ళు లేనిది,
అది ఏమిటి?
15. ఒకటే తొట్టె,
రెండు పిల్లలు,
అది ఏమిటి?
16. ఎర్రటి పండుపై ఈగైనా వాలదు,
అది ఏమిటి?
17. నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను,
చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తా,
అది ఏమిటి?
18. కిట కిట తలుపులు,
కిటారి తలుపు,
ఎప్పుడు తీసిన చప్పుడు కావు,
ఏమిటవి?
19. కొండల్లో పుట్టి కోనల్లో నడిచి,
సముద్రంలో చేరే నెరజాణ,
అది ఏమిటి?
20. గోడమీద బొమ్మ,
గొలుసుల బొమ్మ,
వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ,
అది ఏమిటి?
మీరు ఈ podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu: 20 Funny Podupu Kathalu in Telugu దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.