20 Funny Telugu Riddles With Answers | 20 Funny Telugu Podupu Kathalu
కొంత నవ్వు మరియు మెదడును ఆటపట్టించే వినోదం కోసం చూస్తున్నారా? Podupu Kathaluకి స్వాగతం! మేము మీ కోసం 20 funny Telugu riddles with answers పొందాము. కొన్ని సులువుగా ఉంటాయి, కొన్ని మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, అయితే సరదాగా కొనసాగించడానికి మేము సమాధానాలను పొందాము. మీరు రిడిల్ ప్రో అయినా లేదా రోజూ నవ్వుకోవాలనుకున్నా,Telugu podupukathalu లో తెలుగు యొక్క తేలికైన భాగాన్ని అన్వేషించడంలో మాతో చేరండి. కలిసి నవ్వుదాం!
1. బారు కాని బారు, ఏమి బారు?
సమాధానం: సాంబారు
2. పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము, ఏమిటది ?
సమాధానం: ముద్దు
3. హారము కాని హారము, ఏమి హారము ?
సమాధానం: ఆహారము
4. పుట్టినపుడు పురుగు! పెరిగితే పువ్వుల రాజు, ఏమిటది ?
సమాధానం: భ్రమరము
5. బడి కాని బడి, ఏమి బడి ?
సమాధానం: రాబడి
6. పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి, ఏమిటది ?
సమాధానం: గబ్బిలం
7. బొట్టు కాని బొట్టు, ఏమి బొట్టు?
సమాధానం: తాళిబొట్టు
8. పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు, ఏమిటది ?
సమాధానం: దానిమ్మ గింజలు
9. మతి కాని మతి, ఏమి మతి?
సమాధానం: శ్రీమతి
10. మూడు కన్నులుండు, ముక్కంటిని కాను! నిండా నీరు ఉండు, కుండను కాను, ఏమిటది ?
సమాధానం: కొబ్బరి కాయ
11. మామ కాని మామ, ఏమి మామ?
సమాధానం: చందమామ
12. పచ్చని పొదలో పిచ్చుక విచ్చుకుంది! తెచ్చుకోబోతే గుచ్చుకుంది, ఏమిటది ?
సమాధానం: మొగిలి పువ్వు
13. చెవుల పక్క నక్కి ముక్కు మీదకెక్కుతుంది, ఏమిటది ?
సమాధానం: కళ్ళ జోడు
14. మేక తిన్నాను, తోక పారేశాను, ఏమిటది ?
సమాధానం: వంకాయ
15. పలుకు కాని పలుకు, ఏమి పలుకు?
సమాధానం: వక్క పలుకు
16. పైన పటారాము! లోన లొటారాము, ఏమిటది ?
సమాధానం: మేడి పండు
17. మంచము కింద మామ! ఉరికి పోదాం రావా, ఏమిటది ?
సమాధానం: చెప్పులు
18. మర కాని మర, ఏమి మర, ఏమిటది ?
సమాధానం: పడమర, అలమర
19. మీకు సొంతమైనది కాని, మీకన్నా మీ తోటి వారు ఎక్కువగా వాడతారు, ఏమిటది ?
సమాధానం: మీ పేరు
20. మని కాని మని, ఏమి మని, ఏమిటది ?
సమాధానం: ఆమని