20 Interesting Podupu Kathalu for Kids
20 Interesting Podupu Kathalu for Kids! ఈ ఆకర్షణీయమైన తెలుగు పొడుపు కథలు నేర్చుకోవడం సరదాగా ఉంటుంది, పిల్లలలో మరియు యువకులలో ఉత్సుకత మరియు ఉత్పత్తి చేయగల శక్తిను రేకెత్తించడం కోసం రూపొందించబడ్డాయి. ఈ Telugu Podupu kathalu సాహసం ప్రారంభించనివ్వండి! మీరు Challenge కు సిద్ధంగా ఉన్నారా!
1.ప్రవహిస్తుంది కాని నీరుకాదు,
పట్టుకుంటె ప్రాణం పోతుంది,
ఏమిటి అది?
జవాబు:కరెంటు
2.బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.
ఏమిటి అది?
జవాబు: దానిమ్మపండు
3.భూమిలో పుట్టింది,
భూమిలో పెరిగింది,
రంగేసుకొచ్చింది రామచిలుక,
ఏమిటి అది?
జవాబు: ఉల్లిగడ
4.మంచం కింద మామయ్యా:,
ఊరికి పోదాం రావయ్య,
ఏమిటి అది?
జవాబు:చెప్పులు
5.రాతి శరీరం,
మధ్యలో నోరు,
తిరుగుతూ ఉంటుంది,
తింటూ కక్కుతుంది,
ఏమిటి అది?
జవాబు: తిరగలి
6.రెక్కలు ముయ్యని పక్షి,
రెప్పలు ముయ్యని జాణ,
ఏమిటి అది?
జవాబు: తూనీగ, చేప
7.యంత్రం కాని యంత్రం,
కాదిది మంత్రం,
ఏమిటి అది?
జవాబు: సాయంత్రం
8.యర్రని రాజ్యం,
నల్లని సింహాసనం,
ఒక రాజు ఎక్కితే ఒకరాజు దిగుతాడు,
ఏమిటి అది?
జవాబు: దోసెలు
9.యాదగిరి నా పేరు గుట్ట ను మాత్రం కాను,
ఒక ముఖ్యమంత్రి నా మీద ప్రయానించే వాడు కాని కారు ను కాదు,
మరినేనెవరిని ?
జవాబు: హెలికాప్టర్
10.లోకమంతటికి ఒకటే పందిరి,
ఒకటే అరుగు,ఏమిటి అది?
జవాబు: ఆకాశము-భూమి
11.లక్కబుడ్డి నిండా లక్షల వరహాలు తినేవారే గాని,
దాచి పెట్టుకొనేవారు లేరు,
ఏమిటి అది?
జవాబు: దానిమ్మ కాయ
12.లక్ష్మి దేవి పుట్టకముందు ఆకు లేని పంట పండింది,
ఇప్పటికీ ప్రతి ఇంట ఉంది,
ఏమిటి అది?
జవాబు: ఉప్పు
13.వంరి వంకల రాజు,
వళ్ళంతా బొచ్చు,
ఏమిటి అది?
జవాబు: పొలం గట్టు
14.వందమంది అన్నదమ్ములు ,
కట్టి పడేస్తే - కావలసినప్పుడు కదులుతారు,
దుమ్ము ధూళీ దులుపుతారు,
ఏమిటి అది?
జవాబు : చీపురు కట్ట
15.వానొస్తే పడగ విప్పు,
ఎండ వస్తే పడగ విప్పు,
గాలి వేస్తే గడ గడ వణుకు,
ఏమిటి అది?
జవాబు: గొడుగు
16.వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు,
వ్రేలిమీద నుండి నేలజూచు,
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో,
విశ్వదాభిరామ వినురవేమ,
ఏమిటి అది?
జవాబు : గాలిపటం
17.శంకు లో పెంకు,
పెంకు లో తీర్థం,
తీర్థం లో మొగ్గ,
ఏమిటి అది?
జవాబు: టెంకాయ
18.శాస్త్రం చెన్నప్ప,
నేల గీరప్ప,
మూల నక్కప్ప,
ఏమిటి అది?
జవాబు: పార
19.శిత్తి లో ఇద్దరు దొంగలు కూర్చున్నారు,
ఏమిటి అది?
జవాబు: వేరుశనక్కాయ
20.శెల లో శెల్వరాజు,
పట్నాన పచ్చ రాయి,
పేలూరు తెల్ల రాయి,
నెల్లూరు నల్ల రాయి,
నాలుగున్నూ చేర్చి ముప్పయి ఇద్దరు,
తొక్కగ కారింది రక్తం,
ఏమిటి అది?
జవాబు: తాంబూలం
మీరు ఈ Podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,podupu kathalu:Old Telugu Riddles with Answers దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.