20 Podupu Kathalu in Telugu
తెలుగు పొడుపు కథలకు స్వాగతం ! ఈ తెలుగు బ్లాగులో ఆహ్లాదకరమైన 20 Podupu Kathalu in Telugu మీరు చదివడానికి మరియు ఆనందించడానికి ఇక్కడ ఉన్నాయి.ఈ తెలుగు పొడుపు కథల లోకి ప్రవేశిద్దాం! ఈ పోస్ట్‌లో మేము Podupu Kathalu in Telugu సమాధానాలతో సహా ఇచ్చాము.
మీరు సవాలుకు సిద్ధంగా ఉన్నారా?
1.హంస ముక్కు కీ ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది,ఏమిటది?
జవాబు: ప్రమిద
2.హడవిడిగా తిరిగే రంగయ్య -అమ్దరి ఇండ్లు నీవేనయ్యా,ఏమిటది?
జవాబు: కుక్క
3.హద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు,ఏమిటది?
జవాబు: అబద్దం
4.హస్త ఆరు పాళ్ళు చిత్త మూడు పాళ్ళు,ఏమిటది?
జవాబు: వర్షం
5.హుస్సేన్ సాబ్ ఉరకాలంటాడు ఖాదర్ సాబ్ కాదంటాడ,ఏమిటది?
జవాబు: ఎనుముపగ్గం
6.హనుమంతరావు గారి పెండ్లాం గుణవమ్తురాలు,
తెట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవంచుకొన్నది.ఏమిటది?
జవాబు: జొన్నకంకి
7.అది లేకపోతె,
ఎవ్వరూ ఏమీ తినరు,
ఏమిటది?
జవాబు: ఆకలి
8.నూతిలో పాము,
నూరు వరహాలిచ్చినా బయటకు రాదు,
ఏమిటది?
జవాబు: నాలుక
9.నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
జవాబు: దీపం వత్తి
10.పచ్చపచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు,ఏమిటది?
జవాబు: మిరప పండ్లు
11.పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం,
తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా,
ఏమిటది?
జవాబు: దీపం
12.పిడికెడంత పిట్ట!అరిచి గోల చేస్తుంది,
ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
ఏమిటది?
జవాబు: దూరవాణి
13.బంగారు భరిణలో రత్నాలు,
పగుల గొడితేగాని రావు.
ఏమిటది?
జవాబు: దానిమ్మపండు
14.మాట్లాడుతుంది కానీ మనిషి కాదు,ఏమిటది?
జవాబు: రేడియో
15.యంత్రం కాని యంత్రం-కాదిది మంత్రం,ఏమిటది?
జవాబు: సాయంత్రం
16.దేహమెల్ల కళ్లు,
దేవేంద్రుడు కాను,
నరవాహనము లేక నడిచిపోలేను,
నాకు జీవం లేదు కానీ జీవుల్ని చంపుతాను,
ఏమిటది?
జవాబు: వల
17..అమ్మ అంటే అందుతాయి నాన్న అంటే అందవు,
ఏమిటది?
జవాబు: పెదవులు
18.అరచేతి పట్నాన అరవై రంధ్రాలు,ఏమిటది?
జవాబు: జల్లెడ
19.ఆ మనిషికి రెండే కాళ్ళు,
ఏడు చేతులు,
ఏమిటది?
జవాబు: నిచ్చెన
20.నాకున్నది ఒకే కన్ను,
చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు దూసుకు పోను,
ఏమిటది?
జవాబు: సూది
మీరు ఈ Podupu Kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని Podupu Kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu:Hard Podupu Kathalu with Answers దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.