MindYourLogic

Logical Riddles in Telugu with Answers


హాయ్ స్నేహితులారా! మన తెలుగు బ్లాగ్ పోస్టుకు స్వాగతం. ఈ రోజు, మీ మేధస్సును పరీక్షించే అద్భుతమైన Logical Riddles in Telugu with Answers తో మీ ముందుకు వస్తున్నాం. ఈ Logical Riddles in Telugu  మీ ఆలోచనా శక్తిని మరింత పదును పెట్టేందుకు సాయపడతాయి. Logical Riddles మన మెదడుకు మంచి వ్యాయామం, ఈ తెలుగు పొడుపు  కథలు మీకు కొత్త కోణంలో ఆలోచించడానికి ప్రేరణ ఇవ్వగలవు. మరి మీరు ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

logical riddles in telugu with answers

1. పిచ్చోడు కాదు,
పేపర్లు చింపుతాడు,
భిచ్చగాడు కాదు,
అడుకుంటడు,
ఎవరు​ ?

జ. బస్సు కండక్టర్

 

2. నామం ఉంటుంది కానీ పూజారి కాదు,
 వాలముంటుంది కాని కోతి కాదు,
ఎమిటది?

జ. ఉడుత

 

3. ఓహొయి రాజా,
ఒడ్డు పొడుగేమి,
 పట్టుకోబోతే పిడికెడు లేవు,
ఎమిటది?

జ. పొగ

 

4. కాళ్లు లేవు గానీ నడుస్తుంది,
కళ్లు లేవు గానీ ఏడుస్తుంది,
ఎమిటది?

జ. మేఘం

 

5. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు,
 నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, 
తంతే తన్నింది గాని కాలు లేదు,
ఎమిటది?

జ. అద్దం

 

podupu kathalu in telugu ad - 1

 

6. జానెడు ఇంట్లో, 
మూరెడు కర్ర,
ఎమిటది?

జ. కుండలో గరిటె

 

7. కుడితి తాగదు, 
మేత మేయదు, 
కానీ కుండెకు పాలిస్తుంది,
ఎమిటది?

జ.తాటిచెట్టు

 

8. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు,
 అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు,
ఎమిటది?

జ. నత్త

 

9. పైన చూస్తే పండు, 
పగుల గొడితే బొచ్చు,
ఎమిటది?

జ. పత్తి కాయ

 

10. పొట్టలో వేలు,
 నెత్తి మీద రాయి,
ఎమిటది?

జ. ఉంగరం

 

podupu kathalu in telugu ad - 2

 

11. పొడవాటి మానుకి నీడే లేదు,
ఎమిటది

జ. దారి

 

12. పోకంత పొట్టి బావ,
 కాగంత కడప మోస్తాడు,
ఎవరది?

జ. పొయ్యి

 

13. ముట్టుకుంటే ముడుచుకుంటుంది,
పట్టుకుంటే గుచ్చుకుంటుంది,
ఎవరది?

జ. అత్తిపత్తి

 

14. ముద్దుగా నుండును, 
ముక్కుపైకెక్కు, 
చెవులు రెండూ లాగి చెంప నొక్కు,
దండి పండితులకు దారి చూపుట వృత్తి,
ఎమిటది?

జ. కళ్లజోడు

 

15. పైడిపెట్టెలో ముత్యపు గింజ,
ఎమిటది?

జ. వడ్లగింజ

 

podupu kathalu in telugu ad - 3

 

16. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు,
ఎమిటది?

జ. కడవ, చెంబు

 

17. పూజకు పనికిరాని పువ్వు,
పడతులు మెచ్చే పువ్వు,
ఎమిటది?

జ. మొగలిపువ్వు

 

18. అలాము కొండకు,
 సలాము కొట్టు,
ఎమిటది?

జ. గొడ్డలి

 

19. అమ్మంటే దగ్గరకు.. 
అయ్యంటే దూరంగా పోయేవి. 
ఏమిటి?

జ. పెదవులు

 

20. అంక పొంకలు లేనిది, 
ఎమిటది?

జ. శివలింగం

 

podupu kathalu in telugu ad - 1

 

21. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది,
ఎమిటది?

జ. ఈతచెట్టు

 

22. మనిషికి రెండే కాళ్లు,
 ఏడు చేతులు,
ఎమిటది?

జ. నిచ్చెన

 

23. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా ,
బయటకు బయలుదేరుతుంది,
ఎమిటది?

జ. గొడుగు

 

24. నల్లని షర్టువాడు, 
కావలికి గట్టివాడు,
ఎమిటది?

జ. తాళం

 

25. బండకు కొడితే వెండి ఊడుతుంది,
ఎమిటది?

జ. కొబ్బరికాయ

 

podupu kathalu in telugu ad - 2

 

26. అమ్మతమ్ముడినికాను, 
కానీ నేను మీకు మేనమాను,
ఎవరు నేను? 

జ. చందమామ

 

27. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది,
ఎమిటది?

జ. గొడ్డలి

 

28. అరచేతి కింద అరిసె,
ఎమిటది?

జ. పిడక

 

29. అడ్డ గోడ మీద పూజారప్ప,
ఎమిటది?

జ. తేలు

 

30. అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు, 
ఎమిటది?

జ. ఆకలి

 

మీరు ఈ Podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని  నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి, podupu kathalu:Detective Mehul Riddles in Telugu  దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.



 

 



 

 

 


podupu kathalu in telugu

35-Telugu-Short-Stories-Fun-Riddles-for-Kids-Adults
Palak chhabriya 2026-04-03

35+ తెలుగు పొడుపు కథలు | పిల్లలు & పెద్దల కోసం సరదా రిడిల్స్

తెలుగు పొడుపు కథలు చదవాలనుకుంటున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ ఆస్వాదించే 35+ సరదా తెలుగు పొడుపు కథలు...

60-telugu-riddles-with-answers-for-kids-and-adults-trendy
Palak Chhabriya 2026-03-31

60+Telugu Riddles with Answers for Kids and Adults – TRENDY

Discover the new collection of 60 +Telugu riddles with answers for kids and adults- TRENDY. From eas...

50-best-podupu-kathalu-riddles-2026-edition
Palak Chhabriya 18-03-2026

50+ Best Podupu Kathalu (Riddles) 2026 Edition

మీరు ఉత్తమ తెలుగు పొడుపు కథల కోసం చూస్తున్నారా? సమాధానాలతో కూడిన 50+ Best Podupu Kathalu 2026 Editio...

35-fun-telugu-riddles-for-everyone-podupu-kathalu
Palak Chhabriya 18-03-2026

35+ fun Telugu riddles for everyone | Podupu Kathalu

35+ fun Telugu riddles for everyone సమాధానాలతో చదవండి. పిల్లలు, విద్యా ర్థులు మరియు పెద్దలు అందరూ ఆస...

50-plus-telugu-riddles-img-1
Kanchan Balani 23-08-2024

50+ Telugu Riddles | MindYourLogic Riddles

Challenge your mind with these amazing Telugu Riddles . These riddles will sharpen your thinking ski...