Top 20 Riddles in Telugu


తెలుగు పొడుపు కథలకు స్వాగతం ! ఈ తెలుగు బ్లాగులో  ఆహ్లాదకరమైన Top 20 Riddles in telugu  మీరు చదివడానికి మరియు ఆనందించడానికి ఇక్కడ ఉన్నాయి.ఈ తెలుగు పొడుపు కథల లోకి ప్రవేశిద్దాం! ఈ పోస్ట్‌లో మేము Top 20 Riddles in telugu సమాధానాలతో సహా ఇచ్చాము.

 

1. ఐదుగిరిలో చిన్నోడు,
పెళ్ళికి మాత్రం పెద్దోడు,
ఏమిటది?

జ: చిటికెన వేలు

 

2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు,
ఏమిటది?

జ: నిప్పు


3. నా నిండా రంధ్రాలు, 
అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను,
నేను ఎవరిని?

జ: స్పాంజి

 

4. తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు,
ఏమిటది?

జ: అక్షరాలు

 

5. నీటితో పంట - ఆకు లేని పంట,
ఏమిటది?

జ: ఉప్పు

 

 

 

6. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా,
ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ,
ఏమిటది?

జ: రామచిలుక

 

7. దాస్తే పిడికిలిలో దాగుతుంది,
తీస్తే ఇల్లంతా జారుతుంది,
ఏమిటది?

జ: దీపం వెలుగు

 

8. కాళ్లు లేవు గానీ నడుస్తుంది,
కళ్లు లేవు గానీ ఏడుస్తుంది,
ఏమిటది?

జ: మేఘం

 

9. తల్లి దయ్యం,
పిల్ల పగడం,
ఏమిటది?

జ: రేగుపండు

 

10. అందరినీ పైకి తీసుకెళ్తాను,
కానీ నేను మాత్రం వెళ్లలేను,
నేను ఎవరు?

జ: నిచ్చెన

 

 

 

11. చిన్న పాపకు చాలా చీరలు,
ఏమిటది?

జ:  ఉల్లిపాయ

 

12. జాన కాని జాన,
ఏమి జాన,
ఏమిటది?

జ: ఖజాన

 

13. తెలిసేలా పూస్తుంది,
తెలియకుండా కాస్తుంది,
ఏమిటది?

జ: వేరుశెనగ కాయ

 

14. లాగి విడిస్తేనే బ్రతుకు,
ఏమిటది?

జ: ఊపిరి

 

15. పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు,
ఏమిటది?

జ: పత్తి పువ్వు

 

 

 

16.పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే,
ఏమిటది?

జ: దీపం

 

17. పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి,
చూసే వారే కాని పట్టే వారు లేరు,
ఏమిటది?

జ: సూర్యుడు

 

18. మూత తెరిస్తే,
ముత్యాల పేరు,
ఏమిటది?

జ: దంతాలు

 

19. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం,
ఏమిటది?

జ: తేనె పట్టు

 

20. రసం కాని రసం,
ఏమి రసం,
ఏమిటది?

జ: నీరసం

 

మీరు ఈ Podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని  నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి, podupu kathalu:Old Telugu Riddles with Answers దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.

 


podupu kathalu in telugu

test-your-iq-with-20-telugu-podupu-kathalu-riddles
Anshul Khandelwal 2023-07-12

Test Your IQ with 20 Telugu Podupu Kathalu Riddles: Can You Solve Them All?

Here are 20 Telugu Podupu Kathalu for kids with answers to test your IQ. It's a challenge for you to...

20-funny-riddles-in-telugu-for-kids-brain-boosting-telugu-podupu-kathalu-with-answers
Anshul Khandelwal 2023-07-17

Podupu Kathalu: 20 Funny Riddles in Telugu for Kids - Brain-Boosting Telugu Podupu Kathalu with Answ

Challenge yourself with 20 funny Telugu riddles, known as 'Podupu Kathalu.' Can you crack the clever...

podupu-kathalu-20-easy-telugu-riddles-with-answers-to-challenge-your-brain
Anshul Khandelwal 2023-07-19

Podupu Kathalu: 20 Easy Telugu Riddles with Answers to Challenge Your Brain!

Challenge Your Brain with 20 Telugu Riddles - 'Podupu Kathalu'! Solve easy brain-teasers in Telugu a...

20-easy-telugu-riddles-for-kids-with-answers-to-boost-your-iq-image
Anshul Khandelwal 2023-07-26

20 Easy Telugu Riddles for Kids with Answers To boost your IQ

Boost your IQ with 20 Easy Telugu Riddles for Kids with Answers. Delve into brain-boosting entertain...

20-telugu-podupu-kathalu-for-kids-with-answers
Anshul Khandelwal 6,Sep 2023

20 Telugu Podupu Kathalu for Kids with Answers | తెలుగు పొడుపు కథలు

Engage young minds with these fun and challenging Telugu podupu kathalu (riddles) for kids. Find ans...